వేతన జీవులకు తీపికబురు.. భారీగా వడ్డీ రేట్ల తగ్గించిన ఆర్బీఐ

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-06 06:08:04  IST  )

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను తగ్గించింది.

వేతన జీవులకు తీపికబురు.. భారీగా వడ్డీ రేట్ల తగ్గించిన ఆర్బీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. ముంబైలో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) వెల్లడించారు. ఈ సారి ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. రెపో రేటు 6 నుంచి 505 శాతానికి తగ్గింది. గత రెండు సందర్భాల్లో 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను RBI తగ్గించిన విషయం విదితమే. ఈ పరిణామంతో హోం లోన్స్‌ (Home Loans)తో పాటు వెహికల్, పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గనున్నాయి. ఇది ఓ రకంగా వేతన జీవులకు పెద్ద శుభవార్తేనని చెప్పుకోవాలి. మరోవైపు వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Markets) లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదయ్యే చాన్స్ ఉందన్నారు. తొలి క్వార్టర్‌లో 6.5 శాతం, రెండో క్వార్టర్‌లో 6.7శాతం GDP నమోదవ్వొచ్చని పేర్కొన్నారు. ఇక మూడు, నాలుగు క్వార్టర్‌లో వృద్ధి రేటు వరుసగా 6.6 శాతం, 6.3శాతం ఉండొచ్చని సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.

Next Story