- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంపు..?
EPFO Interest Rates: ఈపీఎఫ్ఓ(EPFO) ఖాతాదారులకు గుడ్ న్యూస్. 8.25శాతం వడ్డీకొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: EPFO Interest Rates: ఈపీఎఫ్ఓ(EPFO) ఖాతాదారులకు గుడ్ న్యూస్. 8.25శాతం వడ్డీకొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం ఫిబ్రవరి 28న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో తీసుకోనున్నారు. 2024-25లో 5కోట్ల క్లెయిమ్ ప్రాసెస్ కూడా చేశారు.
ఈపీఎఫ్ఓ(EPFO) ఖాతా ఉన్న ఉద్యోగులకు వడ్డీ అందించే విషయంపై కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుండి. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ(EPFO) లో ఉన్న నిల్వలపై 8.25శాతం వడ్డీ(EPFO Interest Rates)ని ఉద్యోగులకు అందిస్తున్నారు. 2024-25 ఆర్థిక ఏడాది నుంచి ఇది కొనసాగుతూ వస్తుంది. ఈసారి కూడా ఇదే కొనసాగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై తుది నిర్ణయం కూడా ఫిబ్రవరి 28న నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Central Board of Trustees)సమావేశంలో తీసుకునే ఛాన్స్ ఉంది.
ఇక్కడ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం(Approval from the Union Finance Ministry) తెలపాల్సి ఉంది. ఆమోదం లభించిన వెంటనే ఈపీఎఫ్ఓ(EPFO) అధికారికంగా వడ్డీరేటును నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని 6కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో జమ చేయనుంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈపీఎఫ్ఓ (EPFO) వడ్డీరేటు 8.25శాతం ఉండేది. ఈ ఏడాది కూడా అదే కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.5శాతం ఉంది. 2021-22లో 8.1 శాతానికి తగ్గించారు. కానీ 2022-23 లో దీన్ని 8.25శాతానికి పెంచారు.
ప్రస్తుతం ఈపీఎఫ్ఓ(EPFO) క్లెయిమ్ ప్రాసెసింగ్ లోకూడా పురోగతి చూపుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 5కోట్లకు పైగా క్లెయిమ్స్ ప్రాసెస్ చేసింది. వీటి మొత్తం విలువ రూ. 2.05 లక్షల కోట్లకు చేరుకుంది. 2023-24లో మొత్తం రూ. 1.82 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల క్లెయిమ్స్ పరిష్కరించిందని కేంద్రం ఈమధ్యే పార్లమెంట్ కు తెలిపింది. ఉద్యోగులకు న్యాయం చేసేందుకు ఈపీఎఫ్ఓ(EPFO) మరింత మెరుగైన సేవలను అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈపీఎఫ్(EPFO) ఖాతాదారలుకు సరైన సమయంలో వడ్డీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






