- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఓలా నుంచి మరో కొత్త స్కూటర్ విడుదల
ఓలా ఎలక్ట్రిక్ తన సరికొత్త S1 X స్కూటర్‌ను అతి తక్కువ ధరతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ భారతీయ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మార్కెట్‌లోకి తన సరికొత్త, అత్యంత శక్తివంతమైన మోడల్ ‘S1 X’ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ.1,29,999గా నిర్ణయించింది. కేవలం ధర మాత్రమే కాకుండా, స్కూటర్ ఇచ్చే మైలేజ్ ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఓలా S1 X స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 320 కి.మీ దూరం ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో ఇది అత్యుత్తమ రేంజ్‌లలో ఒకటి కావడం విశేషం.
ఈ స్కూటర్‌లో ఓలా సొంతంగా తయారు చేసిన భారత్ సెల్స్ (Bharat Sells) ను ఉపయోగించారు. ఇవి పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన బ్యాటరీ కణాలు కావడం ప్రాధాన్యతను సతరించుకుంది. దీనివల్ల బ్యాటరీ ఖర్చు తగ్గడమే కాకుండా పనితీరు మెరుగుపడుతుంది. S1 X మోడల్ స్కూటర్‌లో శక్తివంతమైన 4.6 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది వేగంగా ఛార్జ్ అవ్వడమే కాకుండా ఎక్కువ కాలం మన్నేలా డిజైన్ చేయబడింది. దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో, సామాన్యులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు.






