- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో తగ్గిన భోజన ఖర్చులు
సామాన్యులకు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (Domestic rating agency Crisil) గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్: సామాన్యులకు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (Domestic rating agency Crisil) గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరిలో ఇంట్లో వండుకునే (Home cooked) శాకాహార, మాంసాహార భోజన తయారీ ఖర్చులు తగ్గినట్లు వెల్లడించింది. దిగుబడి పెరగటంతో కూరగాయల ధరలు దిగి రావటం, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో (Bird flu effect) కోడిమాంసం ధర తగ్గటంతో నెలవారీ ఖర్చులు 5 శాతం తగ్గినట్లు ‘రోటీ రైస్ రేట్ (Roti rice rate)’ నివేదికలో తెలిపింది.
ఇక గతేడాది ఫిబ్రవరి నెలతో పోల్చితే శాకాహార వ్యయం 1 శాతం తగ్గగా, మాంసాహారం 6 శాతం పెరిగినట్లు పేర్కొంది. టమాట, LPG సిలిండర్ ధరలు తగ్గడంతో గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే శాకాహార భోజనం తయారీ ధరలు తగ్గాయి. అలాగే, గత ఏడాది ఇదే నెలలో కిలో టమాట రూ.32 ఉండగా.. గత నెలలో 28% తగ్గి రూ.23కు చేరింది. 20% టమాట దిగుబడి పెరగడమే ఇందుకు కారణం. మాంసాహారం విషయానికి వస్తే.. గతేడాదితో పోల్చితే బ్రాయిలర్ ధరలు 15 శాతం పెరగటంతో మాంసాహారం తయారీ ఖర్చు ప్రియమైంది. నాన్ వెజ్ భోజనంలో బ్రాయిలర్ వ్యయమే 50 శాతంగా ఉంది. గతేడాది బ్రాయిలర్ అధిక సరఫరా కారణంగా ధరలు తగ్గగా, ఈసారి కోళ్ల దాణా ఖర్చులు ముఖ్యంగా మొక్కజొన్న ధర 6 శాతం మేర పెరగటంతో బ్రాయిలర్ చికెన్ ధర పెరిగింది. ఇక, జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో ఉల్లి 7 శాతం, బంగాళాదుంప 17 శాతం, టమాటా 25 శాతం, బ్రాయిలర్ 5 శాతం ధరలు తగ్గాయి.






