India: అమెరికా టారిఫ్ తగ్గింపుతో భారత వృద్ధి రేటును పెంచిన గోల్డ్‌మన్ శాక్స్

by S Gopi |

గోల్డ్‌మన్ శాక్స్ ఈ ఏడాదికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధిని 6.9 శాతంగా అంచనా వేసింది.

India: అమెరికా టారిఫ్ తగ్గింపుతో భారత వృద్ధి రేటును పెంచిన గోల్డ్‌మన్ శాక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ వస్తువులపై అమెరికా పరస్పర సుంకాలను 18 శాతానికి తగ్గించే యూఎస్-ఇండియా డీల్ ఖరారవడంతో రేటింగ్ సంస్థలు మనదేశ వృద్ధి అంచనాలను సవరించడం ప్రారంభించాయి. మంగళవారం గోల్డ్‌మన్ శాక్స్ ఈ ఏడాదికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధిని 6.9 శాతంగా అంచనా వేసింది. భారత్-అమెరికా మధ్య ఒప్పందం అమలులోకి వస్తే, తక్కువ సుంకాలు అమలవుతాయి, ఫలితంగా దేశ జీడీపీలో దాదాపు 0.2 శాతం పెరుగుదల కనిపిస్తుందని అంచనా వేస్తున్నామని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. పెట్టుబడుల సెంటిమెంట్ విషయంలో, ఈ ఒప్పందం ముగియడం వల్ల వాణిజ్య-విధాన అనిశ్చితి తగ్గుతుంది. ప్రైవేట్ పెట్టుబడులు సానుకూలంగా మారుతాయి. అయితే, ఇది 2026 ఆఖరులో ప్రైవేట్ నిధుల ద్వారా వాస్తవ జీడీపీ వృద్ధికి మరింత దోహదపడుతుంది. ఈ పరిణామాలతో ప్రస్తుత ఏడాది భారత వృద్ధిని 20 బేసిస్ పాయింట్లు అధికంగా 6.9 శాతానికి పెంచుతున్నామని గోల్డ్‌మన్ శాక్స్ వెల్లడించింది. యూఎస్-ఇండియా డీల్‌తో వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గి ఆర్థిక పరిస్థితులకు మద్దతు లభిస్తుందని, రాబోయే పెట్టుబడుల ద్వారా భారత కరెన్సీ రూపాయిపై ఒత్తిడి సన్నగిల్లుతుందని పేర్కొంది.

Next Story