- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: రూ. 1.05 లక్షల మార్కు దాటిన బంగారం
దేశ రాజధానిలో సోమవారం పది గ్రాములు రూ. 1,05,670 వద్ద కొత్త గరిష్ఠాలను తాకింది.

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు హద్దుల్లేకుండా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే భారీగా పెరిగిన ధరలను చూసి సామాన్యులు కొనేందుకు దూరమవుతుండగా, తాజాగా పసిడి ధరలు సరికొత్త రికార్డు గరిష్టాలకు చేరాయి. వరుసగా ఆరో రోజు బంగారం రూ. 1,000 పెరగడంతో దేశ రాజధానిలో సోమవారం పది గ్రాములు రూ. 1,05,670 వద్ద కొత్త గరిష్ఠాలను తాకింది. ఇందుకు ప్రధానంగా అమెరికా ఫెడ్ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు, గ్లోబల్ మార్కెట్లలో డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం సోమవారం రూ.930 పెరిగి 10 గ్రాములకు రూ.1,05,880 (అన్ని పన్నులు కలిపి) జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి రూ. 850 పెరిగి రూ. 97,050 వద్దకు చేరింది. యూఎస్ ఫెడ్ వ్యవహారంలో పెరుగుతున్న ఆందోళనలు, టారిఫ్ విధానాలపై పెరిగిన అనిశ్చితి మధ్య పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో ధరలు అత్యధికంగా పెరుగుతున్నాయని వ్యాపారులు తెలిపారు. మరోవైపు వెండి ధరలు కూడా రూ. 1,000 పెరిగి కిలోగ్రాముకు రూ. 1,36,000 (అన్ని పన్నులు కలిపి) కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్‌లో డిమాండ్ కారణంగా దేశీయ మార్కెట్లలో వెండి రికార్డు స్థాయిలో పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 3,470.51 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.






