- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: షాక్ ఇచ్చిన బంగారం.. ఒక్కరోజే రూ. 2,000 జంప్
శుక్రవారం సాయంత్రానికి గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం 3,218.07 డాలర్ల వద్ద సరికొత్త రికార్డులకు చేరింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పసిడి ధరలు సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ఠానికి ఎగబాకాయి. గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే బంగారం 3 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠాలకు చేరుకున్నాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ధరలు తొలిసారి 3,200 డాలర్లు దాటి రికార్డు స్థాయిలో పెరిగాయి. శుక్రవారం సాయంత్రానికి గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం 3,218.07 డాలర్ల వద్ద సరికొత్త రికార్డులకు చేరింది. దేశీయంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు రూ. 95,550 వద్దకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లలో ఇది శుక్రవారం ఒక్కరోజే రూ. 2,020 పెరిగి రూ. 95,400కి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 1,850 పెరిగి రూ. 87,450 వద్ద ఉంది. ప్రధానంగా అమెరికా కరెన్సీ డాలర్ విలువ బలహీనపడటం, అమెరికా-చైనా మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన సాధనం బంగారం వైపు పెట్టుబడులను మళ్లిస్తున్నారు. వీటితో పాటు ఈ వారం ప్రారంభంలో జరిగిన అతిపెద్ద బాండ్ విక్రయాల్లో అమెరికా ట్రెజరీలు ప్రతికూలంగా స్పందించడం, అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ డేటా ఆందోళనక్రంగా ఉండటంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. దేశీయంగా వీటి ప్రభావం, ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకుల కారణంగా పసిడి కొత్త రికార్డులను అధిగమిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు యూఎస్ బాండ్లను విక్రయించడం, బంగారం కొనుగోలు చేయడంతో డాలర్ ఇండెక్స్ 100 దిగువకు పడిపోయింది.






