Gold & Silver: అయ్యో ‘వెండి’ వెలవెల..! మళ్లీ భారీగా తగ్గిన రేటు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-06 04:45:18  IST  )

బంగారం, వెండి ధరల పతనం సామాన్యులకు ఊరటనిస్తోంది. గత కొన్ని రోజులుగా అమాంత పెగిగిన ధరలు ఒక్కసారిగా దిగివస్తున్నాయి.

Gold & Silver: అయ్యో ‘వెండి’ వెలవెల..! మళ్లీ భారీగా తగ్గిన రేటు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరల పతనం సామాన్యులకు ఊరటనిస్తోంది. గత కొన్ని రోజులుగా అమాంత పెగిగిన ధరలు ఒక్కసారిగా దిగివస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ (Hyderabad Bullion Market)లో నేడు కిలో వెండి ధరపై ఏకంగా రూ.20,000 వేలు తగ్గింది. ఈ పరిణామం కిలో వెండి ధర రూ.2,80,000 వద్దకు చేరుకుంది. గత రెండు రోజుల్లోనే వెండి ధర ఏకంగా రూ. 40,000 మేర క్షీణించడం ఇన్వెస్టర్లను, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిన్న కూడా కిలోపై రూ.20 వేల మేర తగ్గిన విషయం తెలిసిందే.

బంగారం ధర కూడా డౌన్...

మరోవైపు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.2,070 తగ్గి రూ.1,52,350 వద్ద ధర కొనసాగుతుండగా.. 22 క్యారెట్ బంగారంపై రూ.1,900 తగ్గి ధర 10 గ్రాములకు రూ.1,39,650గా ఉంది. ప్రపంచ మార్కెట్‌లో వెండి ధరలు గణనీయంగా తగ్గడం స్థానిక మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున వెండిని విక్రయించి లాభాలను స్వీకరిస్తున్నారు. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటనిస్తోంది. అయితే, అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా ధరలు మరికొంత కాలం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story