- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Returns: 20 ఏళ్లలో స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్‌ల కంటే ఎక్కువ రాబడి ఇచ్చిన బంగారం
స్టాక్ మర్కెట్లతో పోలిస్తే బంగారం సగటున ఏటా 15 శాతం వృద్ధిని సాధించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాదిలో బంగారం ధరలు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సరికొత్త రికార్డు గరిష్టాలకు చేరింది. అంతేకాకుండా గడిచిన రెండు దశాబ్దాలుగా భారత ఈక్విటీ, రియల్ ఎస్టేట్ రంగాల కంటే అత్యధిక రాబడిని బంగారం ఇచ్చిందని తాజాగా ఓ నివేదిక తెలిపింది. రూపాయి మారకం ఆధారంగా చూస్తే, స్టాక్ మర్కెట్లతో పోలిస్తే బంగారం సగటున ఏటా 15 శాతం వృద్ధిని సాధించింది. ఇది నిఫ్టీ50 సాధించిన 13.5 శాతం కంటే ఎక్కువ. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ 7.8 శాతం రాబడిని ఇచ్చింది. మరోవైపు గత ఐదేళ్ల కాలంలో బంగారం భారీగా పుంజుకుంది. ఈ సమయంలో పసిడి ఏడాదికి సగటున 23.2 శాతం పెరిగింది. ఈక్విటీలు 16.5 శాతం పెరిగాయని ఫండ్స్ ఇండియా నివేదిక పేర్కొంది. చాలా దేశాల సెంట్రల్ బ్యాంకుల నుంచి కొనుగోళ్లు, పాలసీ నిర్ణయాల మధ్య సురక్షిత డిమాండ్, భౌగోళిక రాజకీయ ఆందోళనలు, రూపాయి బలహీనత, ఈక్విటీ వాల్యూయేషన్స్ పెరిగిపోవడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈక్విటీలలో మిడ్, స్మాల్-క్యాప్ స్టాక్‌లు 20 ఏళ్లలో లార్జ్-క్యాప్ స్టాక్‌ల కంటే ఎక్కువ పెరిగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 మొత్తం రాబడి ఏటా సగటున 16.5 శాతం, నిఫ్టీ స్మాల్-క్యాప్ 250 సగటున 14.3 శాతం పెరిగాయి.






