Gold: మరోసారి కొత్త రికార్డు గరిష్టాలకు బంగారం ధర

by S Gopi |

వెండి కూడా ఎన్నడూ లేనంతగా దాదాపు 15 ఏళ్ల గరిష్ఠానికి చేరాయి.

Gold: మరోసారి కొత్త రికార్డు గరిష్టాలకు బంగారం ధర
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు కొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుతున్నాయి. ఇప్పటికే వరుసగా పెరిగి సామాన్యులు కొనలేని స్థాయికి చేరిన పసిడి, తాజాగా మరో కొత్త ఆల్‌టైమ్ హైకి పెరిగింది. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం రూ. 2 వేలకు పైగా పెరిగి రూ. 1,15,840 చేరింది. అమెరికా ఫెడ్ కీలక రేట్లలో కోత అంచనాలు పెరగడం, అధిక డిమాండ్ వల్ల బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు తగ్గే సూచనలు కనిపించడంలేదు. బంగారంతో పాటు వెండి కూడా ఎన్నడూ లేనంతగా దాదాపు 15 ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. ఈ పరిణామాలు కూడా ధరలను ప్రభావితం చేస్తున్నాయని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి అన్నారు. మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 2,620 పెరిగి రూ. 1,15,690గా ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ. 2,400 పెరిగి రూ. 1,06,050కి చేరింది. వెండి కిలో రూ. 2 వేలు పెరిగి రూ. 1,50,000 మార్కును తాకింది.

Next Story