స్వల్ప ఊరట.. తగ్గిన బంగారం ధర : స్థిరంగా ఉన్న వెండి రేటు

by Naga Rani Yarlagadda |

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

స్వల్ప ఊరట.. తగ్గిన బంగారం ధర : స్థిరంగా ఉన్న వెండి రేటు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం కొనుగోలు దారులకు నాలుగు రోజుల తర్వాత స్వల్ప ఊరట లభించింది. శుక్రవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1370 మేర తగ్గి.. రూ.1,54,200కు దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1250 మేర తగ్గి రూ.1,41,350వద్ద ఉంది. లైవ్ ట్రేడింగ్ ను బట్టి ఈ ధరల్లో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ఇక వెండి విషయానికొస్తే.. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,75,000గా ఉంది. తగ్గిన ధరలపై జీఎస్టీ, తరుగు అదనంగా ఉంటుంది. శుభకార్యాలు, పెళ్లి ముహూర్తాలు ఉన్న వేళ బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో బేరీజు వేయడం కష్టంగా మారింది.

Next Story