- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Rates Hike Reason: ట్రంప్ ఒక్కడే కాదు.. గోల్డ్ రేట్లు పెరగడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే?
Gold Rates Hike Reason:బంగారం ధరలు(Gold Rates) రాకెట్ వేగంతో దూసుకుపోతుండడంతో ఇన్వెస్టర్ల పంట పండుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: Gold Rates Hike Reason: బంగారం ధరలు(Gold Rates) రాకెట్ వేగంతో దూసుకుపోతుండడంతో ఇన్వెస్టర్ల పంట పండుతోంది. అదే సమయంలో కొనుగోలుదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఇంతకీ బంగారం ధరలు ఇలా ఎందుకు పెరిగాయో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.
బ్రేకుల్లేని బండిలా బంగారం(Gold) దూసుకుపోతోంది. 80 వేలు, 82 వేలు, 83 వేలు అంటూ రోజుకో రికార్డు క్రియేట్ చేస్తోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ చరిత్రలో తొలిసారి 83 వేల రూపాయల మార్కును టచ్ చేయడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ బంగారం ధరలు ఇంతలా పెరగడానికి కారణాలేంటి?
ఆ భయాలే కారణమా?
ప్రపంచ మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్ వల్ల పెట్టుబడిదారులలో భయాలు పెరిగాయి. యూరోపియన్ యూనియన్, చైనా, మెక్సికో లాంటి దేశాలపై అమెరికా టారిఫ్ విధించే అవకాశాలు పెట్టుబడిదారులను బంగారంలో ఇన్వెస్ట్ చేసేలా ప్రేరేపించాయి. ఇటు అమెరికా డాలర్ విలువ తగ్గడం, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో భారత్‌లో కూడా ధరలు పతాక స్థాయికి చేరుకున్నాయి.
ఇన్‌వెస్టర్లకు వరం
ఇక ఇలా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడం పెట్టుబడిదారులకు వరంగా మారింది. ఉదాహరణకు, ప్రస్తుతం ధరలు పీక్స్‌కు వెళ్లడంతో గతంలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు అధిక లాభాలను పొందవచ్చు. ఒక పెట్టుబడిదారుడు గత సంవత్సరం 50,000 రూపాయలకు 10 గ్రాముల బంగారం కొనుగోలు చేశారని అనుకుందాం. ఇప్పుడు అదే బంగారం 83,100 రూపాయలు విలువ చేస్తుంది. అంటే, లాభం 33,100 రూపాయలు
కొనుగోలుదారులకు శాపం
నిజానికి బంగారం ఒక ఖరీదైన లోహం. ఇది నగల తయారీకి, మైనింగ్, ఇన్‌వెస్ట్‌మెంట్స్‌కు వినియోగిస్తారు. ఆర్థిక అనిశ్చితిలో బంగారం ధరలు పెరుగుతాయి. అందుకే దీన్ని సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా విలువ ఉంటుంది. ఇది ఇన్వెస్టర్లకు మెరుగైన రిటర్న్‌లు అందిస్తుంది. బంగారం తక్షణ లిక్విడిటీ కలిగిన ఆస్తి కావడంతో మనకు అత్యవసరమైతే దీన్ని సులభంగా అమ్ముకొని డబ్బు పొందవచ్చు. ఇటు భారతీయ కుటుంబాల్లో బంగారాన్ని సంపదగా భావిస్తారు. దీన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తుంటారు. అయితే బంగారం ధరలు ఇంతలా పెరగడం సాధారణ వినియోగదారులకు ఒక ఆర్థిక భారమని చెప్పవచ్చు. ఇది ముఖ్యంగా బంగారం కొనుగోలు చేసే వివాహాలు, పండుగల సమయంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. దేశంలో పెళ్లిళ్లలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ధరలు పెరగడంతో ఆభరణాలు కొనడం కష్టంగా మారుతుంది. ఉదాహరణకు, గతంలో 5 లక్షల రూపాయల విలువైన బంగారం ఇప్పుడు 7 నుంచి 8 లక్షలకు లభిస్తోంది. ఇలా ధరలు పెరగడం వల్ల చిన్న మొత్తంలో కూడా బంగారం కొనడం మధ్యతరగతి కుటుంబాలకు కష్టమవుతుంది.






