Gold Price : ఉసేన్ బోల్టులా పరుగెడుతున్న గోల్డ్ రేట్

by M.Rajitha |
Gold Price : ఉసేన్ బోల్టులా పరుగెడుతున్న గోల్డ్ రేట్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ లో బంగారం ధరలు(Gold Price) వాయువేగంతో పరుగెడుతున్నాయి. ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1650 ల ఆల్ టైమ్ గరిష్టానికి పెరిగి కస్టమర్లు నివ్వెరపోయేలా చేసింది. దేశ క్యాపిటల్ సిటీ ఢిల్లీ(Delhi)లో 10 గ్రాముల బంగారం ధర రూ.98,100 కు చేరింది. ఇక కిలో వెండి ధర కూడా రూ.1900 పెరిగి రూ.99,400 కు చేరింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) నగరంలో బుధవారం సాయంత్రం 10 గ్రాముల బంగారం రూ.97,700కు చేరింది. కిలో వెండి ధర రూ.97,500 వద్దకు చేరింది.

అయితే అమెరికా-చైనా(America- China) మధ్య జరుగుతున్న ట్రేడింగ్ వార్9Trade War) రోజురోజుకు పెరుగుతుండటంతో.. మదుపర్లు గోల్డ్ పై పెట్టుబడులు సేఫ్ గా భావిస్తున్నట్టు సమాచారం. అందువల్ల బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండగా.. ఇప్పుడిప్పట్లో మాత్రం తగ్గేలా కనిపించడం లేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story

Most Viewed