సైలెంట్‌గా ఉన్న వెండి.. మళ్లీ తగ్గిన బంగారం ధర

by Naga Rani Yarlagadda |

బంగారం ధర మళ్లీ తగ్గింది. పెళ్లిళ్లు చేసుకునే జంటలకు ఇది సూపర్ గుడ్ న్యూస్. త్వరలోనే ధర మరింత తగ్గుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

సైలెంట్‌గా ఉన్న వెండి.. మళ్లీ తగ్గిన బంగారం ధర
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు క్రమంగా కొనసాగుతున్నాయి. కొద్దిరోజులుగా వెండి రేట్లలో కొత్తట్రెండ్ కనిపిస్తోంది. ప్రతి మూడురోజులకు ఒకసారి వెండి ధరలు మారుతున్నాయి. ఫిబ్రవరి 13న రూ.20,000తగ్గిన కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద స్థిరపడింది. నేడు కూడా ఇదే ధర కొనసాగుతోంది. బంగారం విషయానికొస్తే.. నేడు ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1310 తగ్గి రూ.1,56,440వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1200 తగ్గి రూ.1,43,400గా ఉంది. ఎల్లుండి నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు ప్రారంభం కానున్న క్రమంలో బంగారం ధరలు తగ్గడం కొనుగోలు దారులకు కాస్త ఊరటనిచ్చిందని చెప్పాలి.

రూ.90 వేలకు బంగారం పతనం?

ఇదిలా ఉండగా.. 2027 చివరినాటికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.90,000 నుంచి లక్షరూపాయల మధ్యలో స్థిరపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రష్యా - అమెరికా మధ్య డాలర్ డీల్ జరుగుతుందన్న వార్తలు రావడమే. రష్యా.. అమెరికా డాలర్లలో వ్యాపారానికి డీల్ చేసుకుంటే బంగారం ధర గరిష్ఠంగా తగ్గుతుందని చెప్తున్నారు. గత నెలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1.84 లక్షలు తాకినా.. ప్రస్తుతం రూ.1.56 లక్షల వద్ద కొనసాగుతోంది. బంగారంపై పెట్టుబడులు పెరగడంతోనే దాని ధర అమాంతం పెరిగిపోయింది.

Next Story