- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Rate: పసిడి ప్రియులకు ఊరట...శాంతించిన బంగారం ధర...మరింత భారీగా తగ్గే అవకాశం...ప్రస్తుతం ధర ఎంతంటే..?
Gold Rate: వరుసగా మూడు రోజులపాటు రికార్డుల మీద రికార్డులు మోగిస్తూ మూత మోగిన బంగారం నేడు కొంచెం శాంతించింది.

దిశ, వెబ్ డెస్క్: Gold Rate: వరుసగా మూడు రోజులపాటు రికార్డుల మీద రికార్డులు మోగిస్తూ మూత మోగిన బంగారం నేడు కొంచెం శాంతించింది. చరిత్రలో తొలిసారిగా ఒక లక్ష రూపాయలు దాటిన బంగారం ఈరోజు ఆ మైలురాయి నుంచి దిగి వచ్చింది. ఏప్రిల్ 23వ తేదీ బుధవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98350 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90150, ఒక కేజీ వెండి ధర రూ. 1,11,000 పలికింది. బంగారం ధర వరుసగా పెరిగిన అనంతరం కొత్తిమీర రిలీఫ్ అందించింది దీనికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులే కారణం అని చెప్పవచ్చు అమెరికాలో ప్రస్తుతం ఒక ట్రాయ్ ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర 40డాలర్ల తగ్గి 3250 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం లాభాల బాటలో పయనిస్తున్నాయి దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు ఈ కారణంగా కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి. అయితే ఈ తగ్గుదల దీర్ఘకాలికంగా కొనసాగుతుందా లేక స్వల్పకాలికమైన అనేది ముందు ముందు తెలియనుంది.
ఎందుకంటే ఇంకా అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతంలో ఇతర దేశాల పైన ప్రకటించిన సుంకాలపైన 90 రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేత చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కాలవ్యవధి భవిష్యత్తులో పొడిగిస్తారా లేక టారిఫ్ ల విషయంలో ఆయా దేశాలతో సంప్రదింపులు జరిపి తగ్గిస్తారా అనేది భవిష్యత్తులో తేలనుంది. దీనికి తోడు అమెరికాలో మాంద్యం భయాలు సైతం ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుదల లేక తగ్గుదల అనేది ఆధారపడి ఉంది. అయితే దేశీయంగా మాత్రం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. దీంతో బంగారానికి డిమాండ్ సైతం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పెరిగిన బంగారం ధరలు పసిడి ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి.






