2026 లోనూ బంగారం ధరలు పైపైకే : వరల్డ్ గోల్డ్ కౌన్సిల్

by Muthe.Rajitha |

2025లో బంగారం ధర భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

2026 లోనూ బంగారం ధరలు పైపైకే : వరల్డ్ గోల్డ్ కౌన్సిల్
X

దిశ, వెబ్ డెస్క్ : 2025లో బంగారం ధర భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. గత జులై నెలలో తొలిసారిగా లక్ష రూపాయల మార్కును దాటిన బంగారం ధర అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది. ఒక్క 2025 లోనే 60 శాతం పైగా బంగారం ధరలు పెరిగాయి. అయితే 2025లో పెరిగినట్టే 2026లోనూ బంగారం ధర భారీగా పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. దాదాపు 15% నుంచి 30% వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. ప్రపంచ ఆర్థిక సమస్యలు, యుద్ధ భయాలు, అమెరికా వడ్డీ రేట్లు తగ్గించడం వంటి కారణాలతో పెట్టుబడిదారులు తమ డబ్బును భద్రంగా ఉంచేందుకు బంగారం కొంటున్నారని కౌన్సిల్ పేర్కొంది.

ప్రస్తుత ధర (సెప్టెంబర్ 2025 నాటికి) ఒక ఔన్స్‌కు 3,772 డాలర్లు ఉండగా.. 2026 సెప్టెంబర్ నాటికి ఇది 4,000 నుంచి 5,300 డాలర్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉందని WGC చెబుతోంది. ఒకవేళ అమెరికాలో ద్రవ్యోల్బణం బాగా పెరిగి వడ్డీ రేట్లు పెంచి డాలర్ బలపడితే మాత్రం బంగారం ధర 5-20% పడిపోవచ్చని కూడా హెచ్చరిస్తోంది. కాగా నేడు భారత్ లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1,30,494 గా ఉంది.

Next Story