Gold: రూ. 3,440 పెరిగిన బంగారం

by S Gopi |

2008, అక్టోబర్ తర్వాత ఈ స్థాయి పతనం నమోదు కావడం ఇదే మొదటిసారి.

Gold: రూ. 3,440 పెరిగిన బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత రెండు వారాలుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ముఖ్యంగా మార్చి నెలలో ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి పసిడి 11 శాతం వరకు దిగొచ్చింది. 2008, అక్టోబర్ తర్వాత ఈ స్థాయి పతనం నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో మళ్లీ పుంజుకున్న బంగారం బుధవారం దాదాపు రూ. 3,500 వరకు పెరగడంతో తిరిగి రూ. 1.50 లక్షలను దాటింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్లే బంగారం ధరలు ఈ స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బుధవారం మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గుతాయనే సంకేతాలు పెరగడంతో ధరలు పుంజుకున్నాయి. ఇదే సమయంలో ముడి చమురు ధరలు కొంత దిగిరావడం, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే ఆలోచనలో లేవనే సంకేతాలు పసిడి, వెండి గిరాకీ పెరిగేందుకు దోహదపడ్డాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ. 3,440 పెరిగి రూ. 1,52,950కి, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 1,40,200కి చేరింది. వెండి కూడా రూ. 5 వేలు పెరగడంతో ఇప్పుడు కిలో రూ. 2.55 లక్షలుగా ఉంది.

Next Story