Gold Rates : హైదరాబాద్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధరలు

by Muthe.Rajitha |

హైదరాబాద్‌(Hyderabad)లో బంగారం ధరలు(Gold Rates) ఆకాశాన్నంటాయి.

Gold Rates : హైదరాబాద్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad)లో బంగారం ధరలు(Gold Rates) ఆకాశాన్నంటాయి. 10 గ్రాముల బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,00,110 కు చేరింది. అయితే ఇది గతంలో కంటే గణనీయమైన పెరుగుదలగా నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 22న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,015గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్-రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, సరఫరా-డిమాండ్ డైనమిక్స్, ప్రపంచ రాజకీయ అనిశ్చితులు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌లో బంగారం డిమాండ్ గల కారణం.. పెళ్ళిళ్ళ సీజన్, దీర్ఘకాలిక పెట్టుబడిగా భావించడం వల్ల అయి ఉండవచ్చునని సమాచారం.

Next Story