- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold: చరిత్రలో తొలిసారిగా రూ. 1.62 లక్షలకు చేరిన బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పది గ్రాములు రూ. 1,62,100 వద్ద ఉన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా, నాటో మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ధరలు పెరిగేందుకు కారణం. ఇక, దేశీయంగా కూడా ఈ లోహాలు కొత్త చారిత్రాత్మక మైలురాళ్లను అధిగమించడం వెనుక అధిక గిరాకీ ప్రభావితం చేస్తోంది. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పది గ్రాములు రూ. 1,62,100 వద్ద ఉన్నాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 10 గ్రాములు పసిడి రూ. 1,690 పెరిగి రూ. 1,62,830కి చేరింది. ఆభరణాల తయారీ ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,550 పెరిగి రూ. 1,49,150 వద్ద ఉంది. వెండి ధరలు కిలో రూ. 3.75 లక్షలుగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు కొత్త రికార్డులను అధిగమిస్తున్నాయి. సోమవారం ఔన్స్ పసిడి తొలిసారిగా 5,000 డాలర్లను దాటి 5,092.71 ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరి కొత్త రికార్డులను బద్దలు కొట్టింది. వెండి ఔన్స్ 108 డాలర్లకు చేరింది.
కారణాలివే..
ఈ ఏడాది ప్రారంభం నుంచే బంగారం, వెండి ధరలు ఊహించని స్థాయిలో దూసుకెళ్తున్నాయి. దీంతో ప్రజలు ఆభరణాలు కొనేందుకు ఎగబడుతుండటం, వివాహాది శుభకార్యాలు ఉండటం వంటి అంశాలు గిరాకీ, ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. దీనికి అంతర్జాతీయ పరిణామాలు, ఉద్రిక్త పరిస్థితులు మరింత ఆజ్యం పోస్తున్నాయి. రాజకీయ, ఆర్థిక అనిశ్చితి వల్ల ప్రజలు, మదుపర్లు సురక్షిత పెట్టుబడిగా బంగారంలో పెట్టుబడికే ఎక్కువ మొగ్గు చూపడం కూడా ధరలు వేగంగా పెరిగేందుకు దోహదపడుతున్నాయి.
ఇంకా పెరుగుతుందా?
ప్రస్తుత పరిస్థితుల్లో విశ్లేషకులు ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. బ్యాంకులు కూడా ఇదే తరహా అంచనాలను వెల్లడిస్తున్నాయి. దేశీయంగా తులం బంగారం రూ. 1,75,000 – రూ. 1,95,000కి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. పరిస్థితులను బట్టి రూ. 2 లక్షలు దాటిన ఆశ్చర్యపోనక్కరలేదని అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి ఔన్సు బంగారం 5,400 డాలర్ల నుంచి 6,000 డాలర్లకు చేరుకోవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇదే సమయంలో ఔన్సు 6,000 డాలర్లకు పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంది.






