- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: రెండు నెలల గరిష్ఠానికి బంగారం ధరలు
డొనాల్డ్ ట్రంప్ పాలనలో వాణిజ్య విధానాల చుట్టు నెలకొన్న అనిశ్చితి మధ్య పసిడి కొనుగోలుపై పెట్టుబడిదారులు ఆసక్తి..

దిశ, బిజినెస్ బ్యూరో: కొన్ని వారాల నుంచి స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం, ఆయన పాలనలో వాణిజ్య విధానాల చుట్టూ నెలకొన్న అనిశ్చితి మధ్య అమెరికా డాలర్ బలహీనపడటంతో పసిడి కొనుగోలుపై పెట్టుబడిదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దేశీయంగా కూడా ఆ ప్రభావంతో బంగారం ధరలు రెండు నెలల గరిష్ఠానికి చేరాయి. గ్లోబల్ మారెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు స్వల్పంగా పెరిగి 2,719.52 డాలర్లకు చేరుకుంది. కొనసాగుతున్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాలకు తోడు ట్రంప్ పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోలపై 25 శాతం మేర సుంకాల పెంపు నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్థానికి గ్లోబల్ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 3,000 డాలర్లకు పెరగవచ్చని బ్రోకర్ మైండ్ మనీ సీఈఓ జూలియా ఖందొష్కో చెప్పారు. ట్రంప్ పదవి చేపట్టకముందు ఉన్న ఊహాగానాలకు భిన్నంగా చైనా, ఇతర దేశాలపై వాణిజ్య సుంకాలను అమలు చేయడం గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా, బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే అమెరికా డాలర్ మాత్రం నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ ప్రభావంతో భారత్‌లోనూ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ. 81,300గా ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల విలువ రూ.74,500 వద్ద ఉంది.






