ముచ్చటగా మూడో రోజు కూడా పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం గోల్డ్ రేట్ ఎంతుందంటే..?

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-16 10:39:12  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

ముచ్చటగా మూడో రోజు కూడా పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం గోల్డ్ రేట్ ఎంతుందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. ఈ క్రమంలో మూడోరోజు అనగా ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,750 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.10 పెరిగి రూ.90,760 ఉంది. అలాగే నిన్న రూ.99,000 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరల పై ఈ రోజు రూ.10 పెరిగి రూ.99,010 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు రూ.100 పెరిగి కిలో రూ. 1,11,100గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,760

24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,010

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,760

24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,010

Next Story