- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన ధరలు
మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల బంగారం రూ.1,40,130 (రూ.1800 తగ్గుదల), 22 క్యారెట్లు రూ.1,28,450.. కిలో వెండి రూ.2,45,000!

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ కారణంగా బంగారం ధరలు (Gold prices) గత ఆకాశమే హద్దుగా పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ఈ క్రమంలో కొనుగోలుదారులకు భారీ ఉపశమనం కలిగిస్తూ ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర ఏకంగా రూ. 1,800 మేర తగ్గింది. ఈ భారీ తగ్గింపుతో ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ. 1,40,130 వద్ద కొనసాగుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల (ఆభరణాల) బంగారం ధర కూడా రూ. 1,650 మేర క్షీణించింది. ఈ పతనంతో 22 క్యారెట్ల పసిడి రేటు ప్రస్తుతం రూ. 1,28,450 కి చేరింది.
స్థిరంగా వెండి ధరలు
బంగారం ధరలు భారీగా తగ్గినప్పటికీ, వెండి ధరలు మాత్రం మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,45,000 వద్ద విక్రయించబడుతోంది. పెళ్లిళ్ల సీజన్ ముగియడం, అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్స్‌కు మొగ్గు చూపడం వల్లే పసిడి ధరలు ఈ స్థాయిలో తగ్గుముఖం పట్టాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.






