పతనమైన బంగారం.. పరుగుపెట్టిన వెండి

by Naga Rani Yarlagadda |

గతవారంలో వరుసగా నాలుగురోజులపాటు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి.

పతనమైన బంగారం.. పరుగుపెట్టిన వెండి
X

దిశ, వెబ్‌డెస్క్: గతవారంలో వరుసగా నాలుగురోజులపాటు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా నాలుగోరోజు బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.710 తగ్గి.. రూ.1,56,220కి పతనమైంది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.650 తగ్గి.. రూ.1,43,200కి దిగివచ్చింది. బంగారం ధరలు తగ్గాయనుకునేలోగానే.. వెండి ధర ఒక్కసారిగా పెరిగింది. కిలో వెండిపై ధర రూ.10,000 పెరిగి.. రూ.3,00,000కు చేరింది. శనివారం కేంద్రం అన్నిరకాల వెండి దిగుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వెండి ధర పెరిగినట్లుగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం.. భారత్ పై గట్టిగానే పడుతోంది. క్రూడ్ ఆయిల్ ధర పెరుగడంతో డాలరుతో రూపాయి విలువ అంతకంతకూ క్షీణిస్తోంది.

Next Story