ఊరటనిచ్చిన బంగారం ధర.. స్థిరంగానే వెండి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-13 05:05:46  IST  )

గతవారం రూ.2400 మేర తగ్గిన బంగారం ధర.. ఈ వారం ఆరంభమే కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చేలా తగ్గింది.

ఊరటనిచ్చిన బంగారం ధర.. స్థిరంగానే వెండి
X

దిశ, వెబ్‌డెస్క్: గతవారం రూ.2400 మేర తగ్గిన బంగారం ధర.. ఈ వారం ఆరంభమే కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చేలా తగ్గింది. సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1420 మేర తగ్గి.. రూ.1,42,910కి దిగివచ్చింది. అలాగే నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1300 మేర తగ్గి రూ.1,31,000కు చేరింది. అయితే ఈ ధరలకు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ కచ్చితంగా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బంగారం ధర తగ్గినా.. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,40,000 గా కొనసాగుతోంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. కొనుగోలుదారులకు దీనిని గమనించాలి.

Next Story