మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఒక్కరోజే భారీగా డౌన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-15 11:25:19  IST  )

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. ఈ ఒక్కరోజే బంగారం ధర ఊహించని రీతిలో తగ్గింది.

మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఒక్కరోజే భారీగా డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: రెండ్రోజుల క్రితం ఊహించని రీతిలో పెరిగి కొనుగోలు దారులకు షాకిచ్చిన పసిడి ధరలు.. వెంట వెంటనే పతనమవుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గ్రాముల బంగారం ధర రూ.2000 పైచిలుకు పతనమవ్వగా.. సాయంత్రం కూడా మరో రూ.2000 పైగా ధర తగ్గింది. ఒక్కరోజులోనే బంగారం ధర రూ.4000 పైగా పతనమైంది. సాయంత్రం 4 గంటల తర్వాత హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 2180 పతనమై.. రూ.1,57,910కి దిగొచ్చింది. ఇదే రీతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2000 తగ్గి రూ.1,44,750 మేర తగ్గింది. మొత్తంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.4420 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.4050 మేర తగ్గింది. కేజీ వెండి ధర సాయంత్రానికి రూ.3,05,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Next Story