Gold Price: ఆశలు వదులుకోండి.. తులం బంగారం లక్ష పక్కా.. పాపం అక్కాచెల్లెళ్ల పరిస్థితి ఊహించుకుంటేనే..

by Vennela |

Gold Price: మహిళలూ..బంగారంపై ఆశలు వదులుకోవాల్సిందే.

Gold Price: ఆశలు వదులుకోండి.. తులం బంగారం లక్ష పక్కా.. పాపం అక్కాచెల్లెళ్ల పరిస్థితి ఊహించుకుంటేనే..
X

దిశ, వెబ్ డెస్క్: Gold Price: మహిళలూ..బంగారంపై ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే పసిడి ధర లక్ష కావడం పక్కా. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు చూసి సామాన్యులు బంగారం షాపుల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. బంగారం అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బంగారం ధర ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. లక్ష చేరడానికి నాలుగు అడుగులే ఉన్నాయి.

మార్చి నెలలో 10 గ్రాముల బంగారం ధర 80వేలు దాటినప్పుడు పసిడి ధర లక్షకు చేరుతుందేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లే కనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్న తీరు చూస్తుంటే.. లక్ష చేరడం కాదు దాటడం పక్కా అనిపిస్తోంది. నేడు ఏప్రిల్ 12వ తేదీ శనివారం 24, 22 క్యారెట్ల బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. తులానికి 270 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 96వేల వద్ద కొనసాగుతోంది. వెండి కిలో ధర హైదరాబాద్ లో రూ. 1,10, 000 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరలు ఇప్పటి వరకు 6.6శాతం పెరిగాయి. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశీయంగా బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతును్నారు. దీని బట్టి చూస్తే మరికొన్ని రోజుల్లో గోల్డ్ రేట్ లక్ష రూపాయలు చేరునున్నాయి. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాలు ఒకదానిపై ఒకటి సుంకాలు విధించడంతో స్పాట్ గోల్డ్ నిన్న యూఎస్డీ 3,200స్థాయిని దాటింది. అమెరికా డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం కనిష్ట స్థాయిలో 99.78 ఉన్న నేపథ్యంలో ఇది బంగారం ధరల పెరుగుదలకు సపోర్ట్ చేస్తుంది.

ఇలా అమెరికా-చైనా ప్రతీకార సుంకాలతో కొట్టుకుంటున్న వేళ ఇన్వెస్టర్లు ఒత్తిడికి గురయ్యారు. వాళ్ల టెన్షన్ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో కనిపిస్తూనే ఉంది. ఈ సమయంలోనే బంగారానికి మించిన సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ మరోటి లేదని భావించి ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో బంగారం ధర భగ్గుమంటోంది.

అసలే ఇది పెళ్లిళ్ల సీజన్ కావడం..ఇలాంటి సమయంలో బంగారం ధర ఇంతలా పెరగడం సామాన్య మధ్యతరగతి జనాలను చాలా ఇబ్బంది పెడుతోంది. తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటితే అర తులం కొనేవాళ్లు గ్రాము కొనుగోలు చేసే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయనడం చాలా వరకు అత్యాశే అవుతుందని మార్కెట్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బంగారం చరిత్ర చూస్తే దిగివచ్చిన రికార్డ్ లేదు. కాబట్టి చేతిలో కొనేంత డబ్బు ఉన్నప్పుడే బంగారం కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. అంతేకాదు రానున్న ఐదారు ఏళ్లలో తులం బంగారం ధర రూ. 2లక్షల వరకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. పాపం పసిడి ప్రియుల ఆందోళన తలచుకుంటే బాధేస్తుంది.

Next Story