- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: బంగారం దారి ఎటు వైపు.. 2040 నాటికి పసిడి ధర ఎంతో తెలిస్తే కోటీశ్వరులమే..?
Gold: బంగారం ధర ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్: Gold: బంగారం ధర ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. సామాన్యుడికి బంగారం అందనంత ఎత్తుకు ఎదిగి కూర్చుంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి అధ్యయనం మనం ఇక్కడ చూడవచ్చు. బంగారం ధరలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెండింతలు అవుతున్న క్రమం మనం గమనించవచ్చు. ఈ క్రమం 2000 సంవత్సరం నుంచి మనం గమనించినట్లయితే 2025 సంవత్సరం వరకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బంగారం ధర రెండింతలు అవుతుందని గమనించవచ్చు. అందుకు దారి తీసిన చారిత్రక నేపథ్యాన్ని మనం ఇప్పుడు చూద్దాం.
బంగారం ధరలు (24 క్యారట్లు, 10 గ్రాములు) : 2000 నుంచి 2025 వరకూ
2000 – రూ. 4,400
2005 – రూ. 7,000
2010 – రూ. 18,500
2015 – రూ. 26,000
2020 – రూ. 48,000
2025 – రూ. 1,00,000
బంగారం ధరలు చారిత్రకంగా గమనించినట్లయితే గడచిన 25 సంవత్సరాలలో బంగారం ధర దాదాపు సుమారుగా 22.7 రెట్లు పెరిగింది. అయితే ఇక్కడ బంగారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెండింతలు అవడానికి అనేక చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. మొదటి ఐదు సంవత్సరాలు అంటే 2000 సంవత్సరం నుంచి 25 సంవత్సరాల మధ్యలో బంగారం ధర ఏకంగా 60% పెరిగింది దీనికి ప్రధాన కారణం అమెరికా - ఇరాక్ మధ్య కొనసాగిన యుద్ధం అని చెప్పవచ్చు. అలాగే అమెరికా పైన ఉగ్రవాదులు దాడి చేయడంతో అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో అమెరికా యుద్ధం చేసింది. ఈ కారణంగా ఆర్థికంగా దెబ్బతినడంతో బంగారం ధర దాదాపు 60 శాతం పెరిగింది.
2005 నుంచి 2010 సంవత్సరాల మధ్యలో బంగారం ధర 2.5 రెట్లు పెరిగింది. ముఖ్యంగా గ్లోబల్ రెసిషన్, ఫైనాన్షియల్ క్రైసెస్ 2008 కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి.బహిరంగ మార్కెట్లో బంగారం ధర దాదాపు 18 వేల రూపాయల వరకు పలికింది. 2010- 2015 మధ్య కాలంలో బంగారం ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ రికవరీ మార్కెట్లో స్థిరంగా ఉండ కారణంగా బంగారం పై డిమాండ్ కాస్త తగ్గింది దీంతో బంగారం ధరలు ఆశించిన స్థాయిలో పెరగలేదు అంటే దాదాపు రెండు రెట్లు అవ్వలేదు అని అర్థం.ఈ మధ్యకాలంలో బంగారం ధర కేవలం 18 వేల రూపాయల నుంచి 26000 రూపాయల వరకు మాత్రమే పెరిగింది.
2015 నుంచి 2020 వరకూ బంగారం మళ్లీ అనూహ్యంగా పెరిగింది. ఒక్కసారిగా కరోనా వంటి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో బంగారం ధర రెండింతలు పెరిగింది. ఫలితంగా బంగారం తొలిసారిగా రూ. 48 వేల మార్కును దాటింది. అక్కడ నుంచి బంగారం ధరలు కొంతకాలం స్థిరంగానే ఉన్నాయి.
2020-2025 మధ్యకాలంలో ఇక ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరిగిపోయాయి అని చెప్పవచ్చు. 2025 వ సంవత్సరంలో బంగారం తొలిసారిగా ఒక లక్ష రూపాయలు దాటింది. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెరలేపిన వాణిజ్యయుద్ధమే కారణమని చెప్పవచ్చు. నిజానికి డాలర్ బలహీనత కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ లెక్కన చూసినట్లయితే బంగారం ధర ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెండింతలు పెరిగినట్లు గమనిస్తున్నారు. అయితే ఈ ఆసక్తికరమైనటువంటి అధ్యయనం వల్ల మరొక అంశం కూడా ఇక్కడ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
భవిష్యత్తులో బంగారం ధరలు రెండింతలు అవ్వడానికి మళ్లీ ఎంత సమయం పడుతుంది. అనే సందేహం కలగవచ్చు. అయితే సరిగ్గా ఐదు సంవత్సరాల్లోనే 2023 నాటికి మళ్లీ 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రెండింతలు అయి 2 లక్షల రూపాయలు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ధరలు స్థిరంగా పెరిగినట్లయితే..2040 నాటికి 6-8 లక్షల వరకూ పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం బంగారాన్ని ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తుండటమే కారణంగా చెప్పవచ్చు. అయితే భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ వంటి ఇతర పెట్టుబడి సాధనాలు అందుబాటులోకి వస్తే మాత్రం బంగారం ధరలు కాస్త స్థిరంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టేవారు ఫిజికల్ బంగారం కన్నా కూడా ఈటీఎఫ్ స్కీముల్లో కానీ, డిజిటల్ రూపంలో కానీ బంగారం కొనుగోలు చేసినట్లయితే మంచి లాభాలను విడిచి పట్టుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు.






