- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Price: వారెవ్వా గంటల్లోనే సీన్ రివర్స్.. భారీ తగ్గిన బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదొడుకులు, డాలర్ విలువ బలపడటంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం (Gold) ధరలు గత కొన్నిరోజులుగా ఊగిసలాడుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ బులియన్ మార్కెట్ (Hyderabad Bullion Market)లో పసిడి ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో స్థానిక మార్కెట్‌లోనూ ధరలు క్షీణించాయి. ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3,290 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం దీని ధర రూ.1,69,800 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల్లో వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3,000 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో ధర రూ.1,55,650గా పలుకుతోంది. ఈ తాజా పరిణామంతో గోల్డ్ లవర్స్ కొనుగోళ్లతో పండగ చేసుకుంటున్నారు.
కాగా, పశ్చిమాసియా (West Asia)లో యుద్ధ వాతావరణంతో పాటు ప్రపంచ మార్కెట్‌లో డాలర్ విలువ బలపడటం, అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరగడం వల్ల స్థానిక మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, వడ్డీ రేట్ల పెంపు సంకేతాల వల్ల పెట్టుబడిదారులు బంగారం నుంచి నిధులను ఉపసంహరించుకోవడం వల్ల ధరల తగ్గుదలకు దారితీసిందని తెలుస్తోంది.






