- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Price: పసిడి ప్రియులకు మైండ్ బ్లాంక్..! ఒక్కరోజే భారీగా పెరిగిన ధర
గోల్డ్ లవర్స్‌కు మరోసారి బంగారం ధరలు ఊహించని షాకిచ్చాయి. ఇవాళ ఒక్కరోజే భారీగా ధర పెరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి (Gold) ధరలకు నేడు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ఇవాళ దేశీయంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ (Hyderabad Bullion Market)లో పెరిగిన ధరలు వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం 10 గ్రాముల ధరపై రూ.1,200 పెరగడంతో ప్రస్తుతం రూ.1,58,620 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరాణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,100 పెరిగి రూ.1,45,400 కు చేరింది. ఇక వెండి (Silver) కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి ధరపై ఏకంగా రూ.4 వేలు పెరగడంతో ప్రస్తుతం మార్కెట్‌లో రూ.2,80,000 పలుకుతోంది.
కాగా, అంతర్జాతీయంగా డాలర్ విలువలో మార్పులు, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఇతర భౌగోళిక రాజకీయ కారణాల వల్ల ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ధరలు మళ్లీ పెరగడం ప్రారంభమైందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.






