బిగ్ రిలీఫ్.. తగ్గిన బంగారం ధర

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-01 06:34:30  IST  )

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర తగ్గింది.

బిగ్ రిలీఫ్.. తగ్గిన బంగారం ధర
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో బంగారం ధరలు అస్సలు స్థిరంగా ఉండటంలేదు. భారీగా పెరుగుతూ.. అదే రీతిలో తగ్గుతూ.. కొనుగోలుదారుల్ని అయోమయానికి గురిచేస్తున్నాయి. మే 29న 10 గ్రాముల బంగారం ధర రూ.1450 నుంచి రూ.1580 మేర పెరగ్గా.. ఆ తర్వాతి రోజు తగ్గింది. నిన్న మార్కెట్లకు సెలవుకావడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఉదయం హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో కొనుగోలు దారులకు ఊరటనిస్తూ.. బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.820 తగ్గి రూ.1,56,220గా ఉంది. మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ కలిపి 10 గ్రాముల రేటు రూ.1,80,215గా ఉంది. అలాగే.. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.750 తగ్గి రూ.1,43,200గా ఉంది. దీనిపై మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ కలిపి రూ.1,65,196గా కొనసాగుతోంది. మరోవైపు వెండి రేటు వరుసగా మూడోరోజు స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.2,90,000గా ఉంది. దీనిపై జీఎస్టీ అదనంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

బంగారం సీన్ మారిందా?.. మార్కెట్లో కొత్త ట్రెండ్!

Next Story