- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold: మరో కొత్త రికార్డు స్థాయికి చేరిన బంగారం
స్టాకిస్టుల నుంచి కొనుగోళ్లు పెరగడం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా పసిడి ధరలు రికార్డు గరిష్టాలు నమోదు చేస్తున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు ఊహించని స్థాయిలో రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇటీవల ఆల్‌టైమ్ హై స్థాయిలను దాటిన తర్వాత శుక్రవారం మరోసారి భారీగా పెరిగాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, దేశ రాజధానిలో శుక్రవారం బంగారం ధరలు రూ. 900 పెరిగి రూ. 1,06,970కి చేరుకున్నాయి. ప్రధానంగా స్టాకిస్టుల నుంచి కొనుగోళ్లు పెరగడం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా పసిడి ధరలు రికార్డు గరిష్టాలు నమోదు చేస్తున్నాయి. సెప్టెంబర్ 16-17న జరగనున్న పాలసీ సమావేశంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపును ఎంచుకోవచ్చనే సంకేతంతో వ్యాపారులు భారీగా బంగారంపై మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు రూ. 760 పెరిగి రూ. 1,07,620 ఉండగా, ఆభరణాల తయారీ వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 700 పెరిగి రూ. 98,650కి చేరుకుంది. వెండి ధరలు కూడా కిలో రూ. 1,36,000(అన్ని పన్నులతో సహా)కి చేరుకుంది. ఈ వారంలో అమెరికాలో విడుదలైన ఉపాధి గణాంకాలు నిరాశజనకంగా ఉండటం, రానున్న ఫెడ్ సమావేశంలో రేట్ల కోత ఉంటుందని అంచనాలు పెరగడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బంగారంలో పెట్టుబడులకు మళ్లారు. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం సానుకూలంగా లేకపోవడం కూడా బంగారం ధరలను ప్రభావితం చేశాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు.






