Gold: తగ్గిన బంగారం దిగుమతులు.. వెండి 56 శాతం జంప్

by S Gopi |

వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది.

Gold: తగ్గిన బంగారం దిగుమతులు.. వెండి 56 శాతం జంప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం, వెండి ధరలు పెరుగుతున్నప్పటికీ మనదేశంలో వీటికి గిరాకీ ఏ మాత్రం తగ్గట్లేదు. భారీ ధరల కారణంగా బంగారం విషయంలో ప్రాలు, ఇన్వెస్టర్లు కొంత తక్కువ ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, వెండి విషయంలో పెద్ద ఎత్తున కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. తాజాగా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో బంగారం దిగుమతులు 18.3 శాతం తగ్గి 522 టన్నులకు చేరింది. విలువ పరంగా దిగుమతుల బిల్లు 1.8 శాతం పెరిగి 49.4 బిలియన్ డాలర్లు(రూ. 4.48 లక్షల కోట్ల)కు చేరింది. ఇదే సమయంలో బంగారం ధరలు దాదాపు 25 శాతం మేర పెరిగాయి. అధిక ధరల కారణంగానే దిగుమతులు తగ్గాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, వెండి విషయంలో గణాంకాలు ఇందుకు విరుద్ధంగా ఉన్న్నాయి. సమీక్షించిన సమయంలో వెండి దిగుమతులు ఏకంగా 56 శాతం పెరిగి 5,727 టన్నులుగా నమోదయ్యాయి. విలువ పరంగా 7.8 బిలియన్ డాలర్లు(రూ. 70 వేల కోట్లు)గా ఉంది. ఇది అంతకుముందు ఏడాది 9 నెలల సమయంలో దిగుమతి అయిన 3.4 బిలియన్ డాలర్ల(రూ. 30.8 వేల కోట్ల) కంటే రెట్టింపు జరిగింది.

Next Story