Silver: రూ. 2.44 లక్షలకు చేరిన వెండి ధరలు

by S Gopi |

బుధవారం వెండి ఏకంగా రూ. 10,000 పెరగడంతో కిలో రూ. 2,44,000కి చేరుకుంది.

Silver: రూ. 2.44 లక్షలకు చేరిన వెండి ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే రికార్డు గరిష్ఠాలకు చేరిన పసిడి, వెండి ధరలు బుధవారం కూడా కొత్త గరిష్ఠాలను తాకాయి. అయితే, ధరలు దేశీయ మార్కెట్లలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ముఖ్యంగా వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం వెండి ఏకంగా రూ. 10,000 పెరగడంతో కిలో రూ. 2,44,000కి చేరుకుంది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 1.41 లక్షలు దాటింది. బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 1,39,030 చేరుకుంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 1,27,350 వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం తొలిసారి 4,500 డాలర్లను అధిగమించింది. ఓ దశలో 4,507 డాలర్లకు చేరిన ఔన్స్ బంగారం, ఆ తర్వాత కొంత దిగొచ్చింది. రికార్డు ధరలకు ప్రధానంగా వచ్చే ఏడాది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందన్న అంచనాలు పెరగడంతో పాటు బంగారంలో పెట్టుబడులకు గిరాకీ కొనసాగడం, అమెరికా డాలర్‌తో పాటు భారత కరెన్సీ రూపాయి బలహీనంగా కొనసాగుతుండటం కారణాలుగా ఉన్నాయి.

Next Story