- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Rate: మరో రూ. 800 పెరిగిన బంగారం..కొత్త ఆల్‌టైమ్ హై
గత ఐదు రోజుల్లోనే పసిడి ధరలు దాదాపు రూ.6,000 పెరగడం గమనార్హం.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మరోసారి బంగారం ధరలు సరికొత్త గరిష్ఠాలను చేరాయి. భారత్‌పై అమెరికా అదనపు సుంకం ప్రకటనతో పాటు జ్యువెలర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడంతో పసిడికి గిరాకీ పుంజుకుంది. శుక్రవారం దేశ రాజధానిలో బంగారం ధరలు రూ.800 పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.1,03,420కి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా రూ.800 పెరిగి 10 గ్రాములకు రూ.1,03,000 (అన్ని పన్నులు కలిపి) కొత్త గరిష్టాలను తాకింది. గత ఐదు రోజుల్లోనే పసిడి ధరలు దాదాపు రూ.6,000 పెరగడం గమనార్హం. తాజాగా స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకునే 1 కిలో, 100-ఔన్సుల బంగారు కడ్డీలపై అమెరికా 39 శాతం సుంకం విధించడంతో బంగారం ధరలు పెరిగాయి. ఎందుకంటే స్వట్జర్లాండ్ బంగారు కడ్డీలకు కీలకమైన సరఫరా మార్గం. అమెరికా టారిఫ్ వల్ల ఈ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. బులియన్ మార్కెట్‌లో కొత్త సమస్యకు ఇది కారణమైంది.
ఇప్పటివరకు పన్ను మినహాయింపు కింద ఉన్న స్విట్జర్లాండ్ బంగారంపై కొత్త టారిఫ్ వల్ల ప్రపంచ పసిడి మార్కెట్లో సరఫరా దెబ్బతినవచ్చని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ చింతన్ మెహతా అన్నారు. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, శుక్రవారం ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ పసిడి పది గ్రాములు రూ. 700 పెరిగి రూ. 94,700 వద్ద ఉంది. వెండి ధరలు కూడా కిలో రూ. 1,000 పెరిగి రూ. 1,15,000కి చేరుకున్నాయి(అన్ని పన్నులు కలిపి). అంతర్జాతీయంగా పెరుగుతున్న వాణిజ్య ఆందోళనలతో బంగారం ర్యాలీ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలకు తోడు, బలహీన అమెరికా ఆర్థిక గణాంకాలు, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు ఇందుకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు.






