Gold: రూ. 2 వేలు పెరిగిన బంగారం

by S Gopi |

ఇటీవల కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి తాజాగా అమెరికా టారిఫ్‌ల చుట్టూ నెలకొన్న పరిస్థితుల కారణంగా పెరిగాయి.

Gold: రూ. 2 వేలు పెరిగిన బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: మరోసారి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి తాజాగా అమెరికా టారిఫ్‌ల చుట్టూ నెలకొన్న పరిస్థితుల కారణంగా పెరిగాయి. తాజాగా అమెరికా సుప్రీంకోర్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధికా టారిఫ్‌లను చట్టబద్దం కావడం స్పష్టం చేయడం, ఆ తర్వాత కూడా మళ్లీ ట్రంప్ అన్ని దేశాలపై 10 శాతం సుంకాలు విధించడంతో అంతర్జాతీయంగా పరిణామాలు, వాణిజ్య ఉద్రిక్తతలు మారిపోయాయి. దీంతో పెట్టుబడిదారులు భౌగోళిక రాజకీయ ఆందోళనల మధ్య సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం, వెండి లాంటి లోహాలవైపునకు నిధులను మళ్లించారు. ఈ ప్రభావంతోనే సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో రూ. 2,900పైగా పెరిగి రూ. 1,59,822కి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో సోమవారం స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 2,070 పెరిగి రూ. 1,61,350కి, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 1,900 పెరిగి రూ. 1,47,900 వద్ద ఉంది. వెండి సైతం సోమవారం ఒక్కరోజే రూ. 10 వేలు పెరగడంతో తిరిగి కిలో రూ. 3 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ స్పాట్ గోల్డ్ ఔన్స్ 5,177.51 డాలర్లకు చేరింది. వెండి ఔన్స్ 87 డాలర్ల వద్ద ఉంది.

Next Story