- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Price: రూ. 2 వేలకు పైగా తగ్గిన బంగారం
సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు రూ.1,23,430కి చేరుకున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు రికార్డు గరిష్టాల నుంచి క్రమంగా దిగొస్తున్నాయి. ఇటీవల అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ తగ్గడం, దేశీయ పరిణామాల కారణంగా సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు రూ.1,23,430కి చేరుకున్నాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ. 2,340 తగ్గి రూ.1,22,280కి చేరుకుంది (అన్ని పన్నులు కలిపి). ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 2,150 క్షీణించి రూ. 1,13,000గా ఉంది. యుఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే సంకేతాలు పెట్టుబడిదారుల ఆసక్తిని ప్రభావితం చేయడంతో బంగారం ధరలు బలహీనంగా మారాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ అన్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా సోమవారం ఒక్కరోజే కిలో రూ. 1,55,000కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్స్ 4,015.55 డాలర్లకు చేరింది. వెండి ఔన్స్ ధర 47.60 డాలర్లుగా ఉంది. పెట్టుబడిదారులు బంగారం-ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల నుంచి లాభాల స్వీకరణకు దిగ్గారు. అందుకే ధరలపై ఒత్తిడి కనిపిస్తోందని సౌమిల్ గాంధీ చెప్పారు. ఈ ధోరణి కొంతాకలం కొనసాగుతుందని భావిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకొంత ధరల పతనాన్ని చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.






