Gold Rate: ఒక్కరోజే రూ. 1,400 తగ్గిన బంగారం

by S Gopi |

ముఖ్యంగా చైనా, యూరప్ లాంటి దేశాలతో జరిగే ఒప్పందాలపైనే అందరి అంచనాలు ఉన్నాయి.

Gold Rate: ఒక్కరోజే రూ. 1,400 తగ్గిన బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్న వారికి కొంత ఊరట లభించింది. గురువారం దేశ రాజధానిలో బంగారం ధరలు రూ. 1,360 తగ్గి రూ. 99,620కి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అమెరికా వాణిజ్య ఒప్పందానికి ముందు రిస్క్ పెరగడంతో బంగారం రూ. 1 లక్ష కంటే దిగువకు పడిపోయింది. జపాన్, ఫిలిప్పీన్స్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందాలను ప్రకటించిన తర్వాత రిస్క్ ప్రీమియం తగ్గినందున, బంగారంలో పెట్టుబడి పెట్టినవారు లాభాల బుక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా చైనా, యూరప్ లాంటి దేశాలతో జరిగే ఒప్పందాలపైనే అందరి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా కూడా ఈ పరిణామాలు ధరలు తగ్గేందుకు కారణమయ్యాయి. ఫలితంగా గురువారం సాయంత్రం 99.9 స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం రూ. 1,01,020 ఉండగా, 99.5 శాతం స్వచ్ఛత ఉన్న పసిడి రూ. 99,250కి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,250 తగ్గి రూ. 92,550కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలో రూ. 3,000 తగ్గి రూ. 1,15,000 చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లలోనూ ఔన్స్ బంగారం స్వల్పంగా తగ్గి 3,362.88 డాలర్లకు తగ్గింది.

Next Story