Gold: మరో రూ. 1,000 పెరిగిన బంగారం.. తులం రూ. 1,21,643

by S Gopi |

పండుగ సీజన్, డిమాండ్ పరిణామాల మధ్య సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.

Gold: మరో రూ. 1,000 పెరిగిన బంగారం.. తులం రూ. 1,21,643
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ వేళ బంగారం ధరలు రోజురోజుకు కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. గత ఐదురోజుల నుంచి వరుసగా పెరుగుతున్న పసిడి బుధవారం కూడా మరో రూ. 1,100 పెరగడంతో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1.21 లక్షల మార్కును అధిగమించాయి. దీంతో వరుసగా ఐదు రోజుల్లో బంగారం ధరలు రూ. 5 వేలు పెరగడంతో బుధవారం రాత్రి సమయానికి దేశ రూ. 1,21,324కి చేరింది. దీనికి ప్రధానంగా అమెరికా ప్రభుత్వం నిధుల బిల్లులను సెనెట్‌ ఆమోదించకపోవడంతో షట్‌డౌన్‌లోకి వెళ్లడంతో అంతర్జాతీయ పరిణామాలు కారణమయ్యాయి. దీనికి తోడు దేశీయంగా కూడా పండుగ సీజన్, డిమాండ్, వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పుంజుకోవడం వంటి పరిణామాల మధ్య సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారంలో పెట్టుబడులకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, స్వచ్ఛమైన బంగారం రూ.1,000 పెరిగి 10 గ్రాములకు రూ.1,21,324 (అన్ని పన్నులతో సహా) కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. మంగళవారం 10 గ్రాముల పసిడి రూ.1,20,643 వద్ద ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం రూ. 1,11,213 వద్ద ఉంది. వెండి ధరలు బుధవారం స్థిరంగా ఉన్నాయి. కిలో రూ. 1,61,000(అన్ని పన్నులు కలిపి) వద్దే కొనసాగుతున్నాయని అసోసియేషన్ తెలిపింది. గ్లోబల్ మార్కెట్లలోనూ స్పాట్ బంగారం 1 శాతం కంటే ఎక్కువ పెరిగి ఔన్సుకు 3,895.33 డాలర్ల రికార్డు గరిష్ట స్థాయికి చేరుకోగా, స్పాట్ వెండి దాదాపు 2 శాతం పెరిగి ఔన్సుకు 47.56 డాలర గరిష్ట స్థాయికి చేరుకుంది.

Next Story