- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Rate: మీరు నమ్మండి..నమ్మకపోండి..మరికొన్నిరోజుల్లో తులం బంగారం @ 2 లక్షలు..రాసిపెట్టుకోండి!
Gold Rate: జాగ్రత్తగా వినండి.. డబ్బులు చేతిలో ఉంటే వెంటనే బంగారం దుకాణంకు వెళ్లండి.

దిశ, వెబ్ డెస్క్: Gold Rate: జాగ్రత్తగా వినండి.. డబ్బులు చేతిలో ఉంటే వెంటనే బంగారం దుకాణంకు వెళ్లండి..ఎంత బంగారం వస్తే అంత కొనుగోలు చేయండి. ఎందుకంటే రానున్న రోజుల్లో బంగారం ధర రూ. 2లక్షలు అవుతుంది. నమ్మశక్యంగా లేదా? అయినా ఇది నమ్మాల్సిందే. ఇది మేము చెబుతున్న విషయం కాదు..ప్రపంచ మార్కెట్ పరిస్థితులు చెబుతున్న విషయం. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో అందరికీ తెలిసిందే.
అమెరికా, చైనాల మధ్య ప్రతీకార సుంకాల యుద్ధం సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. అవును బంగారం ధర పెరగడానికి కూడా కారణం అదే. గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పుడు 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర 96 వేల రూపాయలు ఉంది. ఇంకొన్ని రోజుల్లోనే లక్ష దాటుతుంది. రానున్న రోజుల్లో 2లక్షల అవ్వడం కూడా పక్కా అని చెబుతున్నా బులియన్ మార్కెట్ నిపుణులు. ఈ బంగారం ధరల పెరుగుదల సామాన్య ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
భయపడాల్సింది..బాధపడాల్సిందల్లా సామాన్యులే. ఎందుకంటే తులం బంగారం ధర లక్ష అంటేనే ఆందోళన చెందుతున్నారు. కానీ మార్కెట్ నిపుణుల చెప్పిన ఈ షాకింగ్ వార్త వెంటే ఎలా రియాక్ట్ అవుతారో. బంగారం ధర త్వరలోనే 10 గ్రాములకు రూ. 2, 18, 500కి చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు వెల్లడించారు. 2 లక్షలు కాదు అంతకు మించి పెరగవచ్చని చెబుతున్నారు. అయితే ఈ ధరను చేరుకునేందుకు కనీసం ఇంకో 5ఏళ్లు పడుతుందని చెబుతున్నారు. అంటే దేశంలోని మెజార్టీ ప్రజలు రాబోయే 5ఏళ్ల వరకు బంగారం కొనడం కష్టం. దీర్ఘకాలంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ముడి చమురు ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఔన్స్ బంగారం ధర 8వేల డాలర్ల వరకు పెరిగిందనుకుంటే..1 ఔన్స్ =31.1035గ్రాములు. ప్రస్తుతం డాలర్ నుంచి రూపాయి మారకం ధర దాదాపు రూ. 85ఉందనుకుంటే ఇప్పుడు, ఔన్స్‌కు $8000 × రూ.85 = రూ. 6,80,000 అవుతుంది. అంటే 8వేల డాలర్లకు దాదాపు రూ. 6,80, 00 అవుతుంది.
దీన్ని గ్రాముల్లోకి కన్వర్ట్ చేసుకుంటే గ్రాముకు రూ.6,80,000 ÷ 31.1035 = రూ. 21,862..అంటే 10 గ్రాముల బంగారం ధర రూ. 21,862.49 × 10 = రూ. 2,18,500. భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. జులై 2025 నాటికి బంగారం ధరలు ఔన్సుకు 3500డాలర్లకు చేరుకుంటుందని అంచనా. రానున్న 5ఏళ్ల కాలంలో బంగారం ఔన్సుకు 8,000డాలర్లకు చేరుకుంటుంది.
ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే 2047 వరకు బంగారం ధర 10 గ్రాముల 6,96,969 చేరుకుంటుందని అంచనా వేశారు.
#Gold Target = ₹ 696969
— A K Mandhan (@A_K_Mandhan) April 11, 2025
per 10 grams
Year = 2047
CAGR expected = 10%#Gold 🥇
Comment your target 🎯






