హైదరాబాద్‌లో Gold ATM: కార్డు పెడితే చాలు కిలోల కొద్ది బంగారం

by Disha Web Desk 17 |
హైదరాబాద్‌లో Gold ATM: కార్డు పెడితే చాలు కిలోల కొద్ది బంగారం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కొత్త తరహ ఏటీఎం మెషిన్ అందుబాటులోకి వచ్చింది. మాములు ఏటీఎం మెషిన్స్ కరెన్సీ నోట్లను అందిస్తే, కొత్తగా ఏర్పాటు చేసిన మెషిన్ మాత్రం బంగారాన్ని అందిస్తుంది. ఇది ఇండియాలోనే మాత్రమే కాకుండా ప్రపంచంలోనే తొలి గోల్డ్ ఏటీఎం మెషిన్‌ అని దాని నిర్వహాకులు పేర్కొన్నారు. గోల్డ్‌సిక్కా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ Open Cube Technologies Pvt Ltd తో కలిసి ఈ గోల్డ్ ఏటీఎం ని తయారు చేసింది. వినియోగదారులు డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ గోల్డ్ ఏటీఎంలో బంగారాన్ని తీసుకోవచ్చు. క్యాష్ ఎలాగైతే విత్‌డ్రా చేస్తామో, బంగారాన్ని కూడా అలాగే డ్రా చేసుకోవచ్చు.

ఈ ఏటీఎంలో బంగారం కాయిన్స్ రూపంలో ఉంటుంది. 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు మొత్తం 8 రకాల పరిమాణాలలో గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. మొత్తం రూ. 2 నుంచి రూ. 3 కోట్ల విలువైన 5 కిలోల వరకు వివిధ పరిమాణాల్లో గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. ఇది 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం. అలాగే బిఐఎస్ 999 హాల్ మార్క్ కూడా ఉంటుంది. ఈ ఏటీఎం మెషిన్‌లో ప్రతిరోజు బంగారం ధరలను అప్‌డేట్ చేస్తారు. టాక్స్, తరుగు, ధరల విషయంలో ఎలాంటి తప్పులు లేకుండా క్లారిటీ తో కూడిన వివరాలు డిస్‌ప్లే పైన కనిపిస్తాయి.

ప్రస్తుత ఈ గోల్డ్ ఏటీఎం మెషిన్‌ బేగంపేటలోని అశోక రఘుపతి ఛాంబర్స్‌లోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో, ఓల్డ్ సిటీ, అమీర్ పేట, కూకట్ పల్లి లో ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 3,000 గోల్డ్ ఏటీఎం లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed