మెరిసిన వెండి, బంగారం.. ఈ రోజు కొనేవారికి ఇది భారమే !

by Naga Rani Yarlagadda |

బంగారం, వెండి ధరలు ఏ రోజు తగ్గుతాయి. ఏరోజు పెరుగుతాయని అంచనా వేయడం కష్టమవుతోంది.

మెరిసిన వెండి, బంగారం.. ఈ రోజు కొనేవారికి ఇది భారమే !
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరలు ఏ రోజు తగ్గుతాయి. ఏరోజు పెరుగుతాయని అంచనా వేయడం కష్టమవుతోంది. ధరలు పతనమవుతున్నాయని సంబరపడేలోగా.. మళ్లీ పెరిగి షాకిస్తున్నాయి. నిన్న బంగారం, వెండి ధరలు తగ్గగా.. నేడు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.5000 పెరిగి రూ.2,85,000కు చేరింది. ఈరోజు వెండి కొనేవారికి ఇది భారమే అవుతుంది. అలాగే బంగారం ధర నిన్న రూ.1900 మేర తగ్గగా.. నేడు అంతకంటే ఎక్కువే పెరిగింది.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2890 పెరిగి రూ.1,56,600కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2650 పెరిగి రూ.1,43,550కి చేరింది. ఈ ఏడాది జనవరిలోనే వెండి ధర 60 శాతం పెరగడంతో.. నెలాఖరులో ఇన్వెస్టర్లు దానిపై భారీ పెట్టుబడులు పెట్టారు. అంతకు ముందే ఇన్వెస్ట్ చేసినవారు ప్రాఫిట్స్ తీసుకోవడంతో.. వెండి ధర గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఒకానొక దశలో ఒక్కరోజులోనే కేజీ వెండిపై రూ.85000 తగ్గింది. అమెరికా ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ అంశం తెరపైకి రావడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. దేశాల మధ్య యుద్ధవాతావరణం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మరో రెండు మూడు నెలలు బంగారం, వెండి ధరల్లో ఈ హెచ్చుతగ్గులు జరుగుతుంటాయని నిపుణులు చెప్తున్నారు.

Next Story