Gold Rates: అక్షయ తృతీయ ఎఫెక్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు

by Naga Rani Yarlagadda |

బంగారం , వెండి ధరలపై అక్షయ తృతీయ ఎఫెక్ట్ పడింది. ఈ పండుగరోజున బంగారం కొనుగోళ్లు పెరగనుండటంతో డిమాండ్ ఏర్పడింది.

Gold Rates: అక్షయ తృతీయ ఎఫెక్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక డిమాండ్ కారణంగా శనివారం ఉదయం ధరలు భారీగా పెరిగాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర, నేడు మళ్ళీ పెరుగుదల బాట పట్టడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటల తర్వాత ఈ మార్పులు నమోదయ్యాయి. వెండి ధర కూడా పెరగడం గమనార్హం. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.750 పెరిగి.. రూ.1,42,800కి చేరింది. మరోవైపు కిలో వెండి ధర రూ.5000 పెరిగింది. నేడు వెండి ధర రూ.2,80,000గా ఉంది. లైవ్ ట్రేడింగ్ లో మార్పులను బట్టి ఈ ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతాయి. రేపు అక్షయ తృతీయ కావడంతో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ధర పెరిగినట్లుగా తెలుస్తోంది.

Next Story