నేడు భారీగా పెరిగిన బంగారం, వెండిధరలు

by samatah |

మగువలు ఎంతో ఇష్టపడేది, ప్రపంచంలోనే అత్యంత విలువైన, మంచి డిమాండ్ ఉన్నది ఏదైనా ఉన్నదా అంటే, అది బంగారమే.ఏ పెళ్లీలు జరిగినా మంచిదే లేక చిన్న శుభకార్యాలైనా సరే

నేడు భారీగా పెరిగిన బంగారం, వెండిధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మగువలు ఎంతో ఇష్టపడేది, ప్రపంచంలోనే అత్యంత విలువైన, మంచి డిమాండ్ ఉన్నది ఏదైనా ఉన్నదా అంటే, అది బంగారమే.ఏ పెళ్లీలు జరిగినా మంచిదే లేక చిన్న శుభకార్యాలైనా సరే మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కాగా, నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు నేడు ఆకాశాన్ని అంటాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.230 పెరగడంతో గోల్డ్ ధర రూ.61,150గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200 పెరిగి, గోల్డ్ ధర రూ.56,050గా ఉంది. ఇక నేడు బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కేజీ వెండి ధరపై రూ.500 పెరిగి, గోల్డ్ ధర రూ81000గా నమోదైంది.

Next Story