గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. నాలుగు రోజుల తర్వాత తగ్గిన ధర.. 10 గ్రాముల బంగారం ఎంతంటే..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-09 05:18:06  IST  )

సీజన్ అయినా, అన్ సీజన్ అయినా బంగారానికి ఉండే డిమాండ్ ఏమాత్రం తగ్గదని అమాంతం పెరిగిన ధరలను చూస్తుంటే అర్థమవుతుంది.

గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. నాలుగు రోజుల తర్వాత తగ్గిన ధర.. 10 గ్రాముల బంగారం ఎంతంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: సీజన్ అయినా, అన్ సీజన్ అయినా బంగారానికి ఉండే డిమాండ్ ఏమాత్రం తగ్గదని అమాంతం పెరిగిన ధరలను చూస్తుంటే అర్థమవుతుంది. నెలరోజుల వ్యవధిలో 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.6వేలు పెరగడంతో.. కొనుగోలుదారులు షాకవుతున్నారు. ఇలా అయితే బంగారం ఇక సామాన్యులకు అందని ద్రాక్షగానే మిగిలే ప్రమాదం ఉందని దిగులు చెందుతున్నారు. ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకూ.. 10 గ్రాముల బంగారం ధర రూ.4,750 పెరిగింది. వరుసగా పెరుగుతున్న బంగారం ధరల నుంచి నేడు స్వల్ప ఊరట లభించింది.

హైదరాబాద్ లో నేడు (సెప్టెంబర్ 8) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.110, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.100 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,08,380 గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.99,850గా ఉంది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండిపై రూ.1000 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,37,000గా ఉంది. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గడంతో పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది.

Next Story