- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ నిరాశే.. ఊహకందని రీతిలో పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు
వరుసగా నాలుగురోజులు బంగారం, వెండి ధరలు తగ్గే సరికి అందరూ హమ్మయ్య.. ఇక తగ్గుతూ వస్తాయనుకున్నారు. కానీ.. అంచనాలకు అతీతంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: వరుసగా నాలుగురోజులు బంగారం, వెండి ధరలు తగ్గే సరికి అందరూ హమ్మయ్య.. ఇక తగ్గుతూ వస్తాయనుకున్నారు. కానీ.. ఊహలకు అతీతంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఉదయం వరకూ తగ్గిన ధరలు.. మధ్యాహ్నం నుంచి ఊపందుకున్నాయి. బుధవారం ఈ రెండు లోహాల ధరలు భారీగా పెరిగాయి. మరో 10 రోజుల్లో పెళ్లిళ్ల ముహూర్తాలు మొదలు కానుండగా.. బంగారం, వెండి ధరల్లో ఈ హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు కొనాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
బుధవారం ఉదయం 10 గంటలకు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.6600 పెరిగి రూ.1,60,530కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.6050 పెరిగి రూ.1,47,150కి ఎగబాకింది. అలాగే 18 క్యారెట్ల బంగారం రేటు కూడా భారీగా పెరిగింది. 10 గ్రాముల ధర రూ.4950 పెరిగి రూ.1,20,400కు చేరింది. వరుసగా నాలుగురోజులు పడిపోయిన వెండి ధర మళ్లీ పెరుగుతూ వస్తోంది. నిన్న కిలో వెండి ధర రూ.20,000 పెరగ్గా.. నేడు మరో రూ.20,000 పెరిగి రూ.3,20,000కు చేరింది. ఈ బంగారం, వెండి ధరలకు జీఎస్టీ అదనం. ఏదేమైనా పెళ్లిళ్ల సీజన్ ముందు బంగారం, వెండి ధరల ఊగిసలాట కొనుగోలుదారుల్ని అయోమయానికి గురిచేస్తోంది.






