- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బలపడిన డాలర్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మంగళవారం కూడా బులియన్ మార్కెట్లో ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆకాశాన్నంటిన పసిడి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలపడటం, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడంతో బులియన్ మార్కెట్లో ధరలు తగ్గాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం పసిడి, వెండి ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.710 తగ్గి రూ.1,53,000కు చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారంపై రూ.650 తగ్గి 10 గ్రాముల ధర రూ.1,40,250గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,53,150 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలో భారీ పతనం
బంగారం కంటే వెండి ధరలు మరింత భారీగా పతనమయ్యాయి. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 మేర ధర తగ్గడం విశేషం. ఈ తగ్గుదలతో తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,65,000కు చేరింది. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రూ.2,60,000 పలుకుతుండగా, చెన్నైలో రూ.2,65,000 వద్ద విక్రయించబడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న మార్పుల దృష్ట్యా ధరల్లో మరిన్ని ఒడుదొడుకులు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.






