- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి భగ్గుమన్న బంగారం, వెండి ధరలు.. కళ్లు తేలేస్తున్న వినియోగదారులు
బంగారం (Gold), వెండి (Silver) ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం (Gold), వెండి (Silver) ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ వీటి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పసిడి రూ.1.30 లక్షల పైనే పలుకుతుండగా.. వెండి కిలో ధర రూ.1.96 లక్షలు దాటేసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ (Hyderabad Bullion Market)లో సోమవారం ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.660 పెరిగి రూ.1,30,480గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,570గా ఉందని బులియన్ వర్గాలు తెలిపాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.4 వేలు పెరిగి రూ.1,96,000గా నమోదైంది.
బంగారం రేటు పతానం అయ్యేది అప్పుడే...
కాగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve) డిసెంబర్ నెల పాలసీ కమిటీ భేటీలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో బంగారం, వెండికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో స్పాట్ గోల్డ్ ఔన్సు 4,218 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి సైతం రికార్డు గరిష్ఠానికి చేరి 57.76 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ ధరలను అనుసరించి దేశీయంగా బంగారం, వెండి ధరలు 2026లో భారీగా పతనమవుతాయనే చాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Read More... Stocks: రంకెలెస్తున్న బుల్.. రికార్డు లాభాల దిశగా దేశీయ మార్కెట్ సూచీలు






