- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగ వేళ కొనుగోలు దారులకు బిగ్‌షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
సంక్రాంతి పండుగ వేళ బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతూ.. కొనుగోలు దారులకు షాకిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ వేళ బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతూ.. కొనుగోలు దారులకు షాకిస్తున్నాయి. వారం ముందు వరకూ వెండి ధరల్లో గణనీయంగా తగ్గుదల కనిపించడంతో.. ఇక ధరలు తగ్గుతూ వస్తాయన్న ఆశలు మొదలయ్యాయి. ఈ వారం ఆ ఆశలన్నీ అమాంతం కూలిపోయాయి. సంక్రాంతి పండక్కి కొత్త అల్లుళ్లకు అత్తమామలు బంగారం పెట్టే ఆనవాయితీ ఉంది. ఈ సమయంలో ధరలు పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఇవాళ ఒక్కరోజే బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి.
శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1150 పెరిగి రూ.1,40,460కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1050 పెరిగి రూ.1,28,750కి పెరిగింది. బంగారంతో పాటు వెండి కూడా ఊహించని షాకిచ్చింది. కేజీ వెండిపై ఈ ఒక్కరోజే రూ.7 వేలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.2,75,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే ధరలు ఉండనున్నాయి.






