- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold 2025: భోగికి భగ్గుమన్న బంగారం ధర.. రూ.3 వేల పైచిలుకు పెరిగిన పసిడి రేట్స్
Gold 2025: కొత్త ఏడాదిలో బంగారం ధరలు(Gold Rates) భగ్గుమంటున్నాయి. డిసెంబర్ నెలతో పోల్చితే జనవరిలో దాదాపు 5వేల రూపాయలు పెరిగింది. ప్రతిరోజూ బంగారం ధరల్లో కీలక కదలికలు కనిపిస్తున్నాయి. కొత్త సంవత్సరంలో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని భావించిన పసిడి ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు.

Gold 2025: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Gold Rates) .. పసిడి ప్రియులను అయోమయంలో పడేస్తున్నాయి. గతేడాది పెట్టుబడిదారులకు మంచి ఫలితాలు ఇచ్చిన బంగారం.. ఈ ఏడాది ఆరంభం నుంచే అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది. కొత్త ఏడాదిలో బంగారం ధరలు(Gold Rates) భారీగా పెరుగుతూ జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇయర్ ఎండ్ లో బంగారం ధరలు(Gold Rates) స్వల్పంగా తగ్గి. పసిడి ప్రియులకు గోల్డెన్ న్యూస్ అందించాయి. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 78, 039 రూపాయలు ఉంది. కానీ కొత్త ఏడాది మొదటి రోజే బంగారం ధరలు భయపెట్టించాయి. జనవరి 1వ తేదీన 24క్యారెట్ల బంగారం రూ. 440 పెరిగింది. ఆ తర్వాత స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధరలు(Gold Rates) గత వారం రోజులుగా భారీ పెరుగుదల కనిపిస్తోంది.
జనవరి నెల ఆరంభంలో స్థిరంగానే ఉన్న బంగారం ధరలు.. 7వ తేదీ నుంచి పుంజుకోవడం ప్రారంభించాయి. అప్పటి నుంచి వరుస రోజుల్లో గోల్డ్ రేట్లు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారంతో పోల్చితే నేడు సోమవారం బంగారం ధరల్లో కీలక కదలిక కనిపించింది. తులం బంగారం ధర రూ. 400 పెరిగింది. దీంతో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Rates) రూ. 73,400 చేరుకుంది. 24క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ. 80, 070రూపాయలకు చేరుకుంది. క్రిస్మస్ నుంచి సంక్రాంతి(Christmas to Sankranti) వరకు 10 రోజుల్లోనే బంగారం ధర దాదాపు 3వేల రూపాయలు పెరిగింది. సంక్రాంతి పండక్కి బంగారం కొనుగోలు చేద్దామని ప్లాన్ చేసుకున్నవారికి ఈ ధరలు భారీగా షాకిచ్చాయనే చెప్పవచ్చు.
అటు వెండి ధరలు(Silver Rate) కూడా ఈ ఏడాది ఆరంభం నుంచే భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వెండి రేటు కిలోకు 1లక్షపైనే పలుకుతోంది. నిన్నటితో పోల్చితే రూ. 1000 పెరిగింది. కొత్త ఏడాదిలో వెండి కూడా దాదాపు రూ. 3వేల రూపాయలు పెరిగింది. డిసెంబర్ 31, 2024 కిలో వెండి ధర 97,900 ఉంది. అంటే 13 రోజుల్లోనే వెండి ధర దాదాపు రూ. 3వేలు పెరిగింది.
అయితే 2024లో బంగారంపై ఇన్వెస్ట్(Invest in gold) చేసిన వారికి మంచి రిటర్న్స్ వచ్చాయి. ఏడాది మొత్తంలో బంగారం ధర ఏకంగా 30శాతం మేర పెరిగింది. బులియన్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు దశాబ్ద కాలంలోనే ఇదే అత్యుత్తమ వార్షిక ప్రతిఫలమని ప్రపంచ స్వర్ణ మండలి రిపోర్టు(World Gold Council Report) వెల్లడించింది. అయితే ఈఏడాదిలో కూడా బంగారం ధరల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. బంగారం ధర లక్ష కూడా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దీంతో బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి బంగారం ధర రూ. 90వేలు దాటుతుందని ట్రేడ్ నిపుణులు(Trade experts) కూడా అంచనా వేస్తున్నారు. సాగుతూనే ఉన్నాయి.
అసలు బంగారం ధరలు (Gold Rates) భారీగా పెరగడానికి ముఖ్య కారణంగా అమెరికాలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం(Donald Trump's government) అని చెప్పవచ్చు. మొదట్లో ట్రంప్ అధికారంలోకి వస్తే బంగారం ధరలు భారీగా తగ్గుతాయని భావించిన వారికి భారీ నిరాశే ఎదురవుతోంది. ట్రంప్ ప్రభుత్వం ఎకనామిక్ పాలసీ(Economic Policy)లపై అంచనాలను పసిడి ధరలు భారీగా పెంచేలా చేస్తున్నాయి. దీనికి తోడు అమెరికా ఉద్యోగాల గణాంకాలు కూడా దీనికి మరో కారణమని చెప్పవచ్చు. నిజానికి ఈ కారణాల వల్లే అమెరికా బాండ్ ఈల్డ్స్ , డాలర్ బలంగా కొనసాగుతున్నప్పటికీ బంగారం ధరలు కూడా దూకుడుగా ముందుకు సాగుతున్నాయి.
వాస్తవానికి బలమైన లేబర్ మార్కెట్ డేటా(Labor market data) వల్ల బంగారం ధరల్లో తగ్గుదల కనిపించిన సంగతి తెలిసిందే. కానీ కొద్ది రోజులకే ధరలు తిరిగి మళ్లీ పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాలపై పన్నులు, టారిఫ్ లు , భారీగా డిపోర్టేషన్ వంటి కారణాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయనే ఆందోళనలు ఫెడ్ మానిటరీ పాలసీ(Fed Monetary Policy) నిర్ణయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. డాలర్ పెరిగినప్పుడు తగ్గాల్సిన బంగారం..పై కారణాల భిన్నంగా పెరుగుదల చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా ఉండేందుకు ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపడం వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు.






