- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొనుగోలు దారులకు ఊరట.. హైదరాబాద్‌లో తగ్గిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా బంగారం ధరలు (Gold prices) పెరుగుతూ, తగ్గుతూ వినియోగదారులను అయోమయంలో పడెస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పసిడి ధరలు క్షీణించడంతో వినియోగదారులకు ఊరట లభించినట్లయింది. ఇవాళ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,690 తగ్గి, రూ.1,44,170కి చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.1,550 మేర పతనమై రూ.1,32,150 వద్ద పలుకుతోంది.
బంగారంతో పాటు వెండి ధర కూడా దిగివచ్చింది. కేజీ వెండి ధరపై ఏకంగా రూ.5,000 తగ్గి, ప్రస్తుతం రూ.2,35,000గా నమోదైంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, పట్టణాలను బట్టి ఈ స్థానిక స్థానిక పన్నులు, దుకాణాల వ్యయాల ఆధారంగా ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. కాగా, వ్యాపారులు ప్రకటించే ఈ నిమిషాల ధరలపై 3 శాతం జీఎస్టీ (GST) అదనంగా వర్తిస్తుందని బులియన్ నిపుణులు స్పష్టం చేశారు.






